అయోధ్య మరియు ఇక్ష్వాకు వంశస్థుల చరిత్ర

అయోధ్య రాజ్యం (క్రీ.శ 5114), ఇక్ష్వాకు వంశాకుల పరిపాలనలో ఉన్న సుసంపన్నమైన రాజ్యం. మన పురాణాల ప్రకారం ఇంచుమించు క్రీ.శ 2200 సంవత్సరంలో ఇక్ష్వాకు అనే రాజు అయోధ్యా పరిపాలనను చేపట్టాడు అప్పటి నుండి ఆ వంశస్థులని ఇక్ష్వాకు వంశస్థులుగా గుర్తిస్తున్నారు. ఈ వంశంలో జన్మించిన హరిశ్చంద్రుడు, సాగర, దిలీపుడు, భగీరథ, అంబరీషా,అజ మరియు రఘు మహారాజు వంటి గొప్ప గొప్ప వ్యక్తులు పరిపాలించిన రాజ్యం ఐది.

హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం తన రాజ్యాని, భార్యని, కొడుకుని వదులుకొని స్మశానంలో ఓ సాధారణ కాటికాపరిగా జీవించాడు, ఇచ్చిన మాటని నిలబెట్టుకొని చరిత్రలో సత్య హరిశ్చంద్రుడిగా మిగిలిపోయాడు.

సాగర మహారాజు మొట్ట మొదటగా అశ్వమేధాయాగాని నిర్వహించి అయోధ్య రాజ్య బలపరాక్రమాలను నలుదిశలా చాటి చెప్పినాడు, దిలీపుడు రాజ్య క్షేమం కొరకు వంద యజ్ఞాలను చేసి దేవాధిదేవతలను మెప్పించినాడు, భగీరథ మహారాజు తన తపస్సుతో గంగా దేవిని మెప్పించి గంగను భూమి ఫై వెలసేలా చేసిన గొప్ప యోగి, అంబరీష మహారాజు తన యాగాల ద్వారా శ్రీ మహా విష్ణువుని మెప్పించి రాజ్య సంక్షేమం కోసం శాంతి భద్రతలకు ప్రతీకైనా సుదర్శన చక్రాని పొందాడు.

రఘు మహారాజు ఇక్ష్వాకు వంశంలో రథాలను అలవోకగా నడపగల సామర్ధ్యం ఉన్నవాడు తాను సింహాసనాన్ని అధిష్టించిన తరువాత రాజ్యాన్ని నాలుగు దిక్కులా వ్యాపింప చేసాడు. ఆ తరువాత తన గురు దేవుడైన వసిష్ఠ మహర్షి సలహాతో విశ్వజిత్ యాగం చేసి తన సంపదను రాజ్యంలోని ప్రజలకు పంచేసాడు అటువంటి సమయంలో తన గురువైన కౌత్సుడు తాను నేర్పిన పద్నాలుగు విద్యలకు గాను పద్నాలుగు బంగారు నాణ్యాలను గురు దక్షిణగా కోరాడు వెంటనే రఘు మహారాజు తన సైన్యాని పిలిచి తెలవారేలోగా కుబేరుడు ఎక్కడున్నా తీసుకు రావల్సిందిగా ఆదేశించాడు, రఘు మహారాజు బల పరాక్రమాలు గురించి తెలిసిన కుబేరుడు ఆ రాత్రే అయోధ్య నగరంలో బంగారు నాణేల వర్షాన్ని కురిపించాడు. రఘు మహారాజు కాలం చెల్లిన తరువాత ఇక్ష్వాకు వంశానికి రఘువంశం అనే పేరు కూడా వచ్చింది ఆ వంశస్థుల్ని రఘుకులతిలకులు అని కూడా పిలవడం ఆనవాయితీ.

అజ మహారాజుకి సంతానంగా జన్మించిన దశరథుడు తను ఎనిమిది నెలల పిల్లవాడిగా ఉన్నపుడే తన తల్లిని కోల్పోయాడు ఆ భాదని భరించలేని తన తండ్రి అజ మహారాజు కూడా ఆత్మ హత్య చేసుకొని మరణించాడు. వారి తల్లితండ్రుల మరణం తరువాత దశరథుడు ఒంటరిగానే పెరిగి పెద్దవాడై రాజ్యాన్ని కాపాడుకున్నాడు.

Please follow and like us:
error0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *